ప్రపంచ మాజీ నంబర్‌వన్, రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త తెలిపింది. పుట్టిన రోజు నాడే తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘అమూల్యమైన రోజులు ఆరంభమయ్యాయి. పుట్టిన రోజు కేకు ఇద్దరం తినడం నాకెప్పుడూ ప్రత్యేకం’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది.