మా చిత్తశుద్ధికి అవార్డులే నిదర్శనం
- స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రభుత్వ కృషి ఫలితం
- పురపాలికల నిబద్ధత, కృషితోనే ఇది సాధ్యమైంది
- రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి
- స్వచ్ఛ అవార్డు గ్రహీతలతో మంత్రి కేటీఆర్ భేటీ
- మరింత వేగంగా పట్టణాల అభివృద్ధికి పిలుపు

హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పట్టణాభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పట్టణాభివృద్ధిలో తమ చిత్తశుద్ధికి ఈ ఏడాది వివిధ పురపాలక సంఘాలు సాధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులే నిదర్శనమని పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్- 2021 అవార్డులు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు, ఉన్నతాధికారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆదివారం ఈ అవార్డులు అందుకున్న పురపాలికల అధికారులు, నేతలతో ఢిల్లీలో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు ఇస్తున్నామని చెప్పారు. పట్టణప్రగతి వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నగరాలను స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
జాతీయస్థాయిలో జయకేతనం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు, పథకాలతో పట్టణాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. పట్టణ పాలన విషయంలో పీఎం స్వనిధి వంటి కార్యక్రమాల్లోనూ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని గుర్తుచేశారు. సఫాయి మిత్ర పథకంలో దేశంలో రెండోస్థానంతోపాటు 11 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావటం తెలంగాణకు గర్వకారణమన్నారు.
పురపాలకశాఖ సిబ్బంది, పురపాలికల ప్రజాప్రతినిధుల నిబద్ధత, కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. అవార్డులు సాధించిన పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని ఇతర పట్టణాలు చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కలిసి అభినందించడం పట్ల పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. కేటీఆర్ నాయకత్వంలో పట్టణాలను మరింతవేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

