వినూత్న ప్రయోగం: కరోనా లక్షణాలున్నవారిని గుర్తించేందుకు డ్రోన్ల వినియోగం

కౌలాలంపూర్: కరోనా కట్టడిలో మొదటిది.. లక్షణాలున్నవారిని గుర్తించడం.. ఇది చాలా కష్టసాధ్యమైన పని. ఒకేసారి ఎంతోమందికి టెస్ట్‌లు చేయలేం. కొంతమంది లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోరు. బహిరంగ ప్రదేశాల్లో అలాగే తిరిగేస్తుంటారు. ఇలాంటివారిని గుర్తించేందుకు మలేషియా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో కరోనా లక్షణాలున్నవారిని గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా బాడీ టెంపరేచర్ అధికంగా ఉన్నవారిని గుర్తించి వారికి కొవిడ్ టెస్టులు చేస్తున్నారు.
డ్రోన్ ఎలా పనిచేస్తుంది..
ఈ డ్రోన్లు భూమినుంచి 20 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. మనుషుల శరీర ఉష్ణోగ్రతను గుర్తించే సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది. బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉన్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తిరుగుతుంటే ఈ డ్రోన్ గుర్తించి అతడిపై రెడ్ లైట్ వేస్తుంది. అక్కడే ఉన్న పోలీసులు వచ్చి సదరు వ్యక్తిని కొవిడ్ టెస్టులకు పంపుతారు.
లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సంఖ్యలో గుమిగూడుతున్నారని, అందులో ఎవరికి కరోనా ఉందో తెలియడం లేదని మలేషియా సర్కారు అంటోంది. లక్షణాలున్నవారిని గుర్తించి కరోనా ప్రబలకుండా చేసేందుకే ఈ ప్రయోగం చేపట్టామని చెబుతోంది. ఈ ప్రయోగం సానుకూల ఫలితాలను ఇస్తున్నదని అంటోంది. ఈ డ్రోన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా 157 బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

