Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Belraj Kalarickal | మలయాళ చిత్ర పరిశ్రమ (Malayala Film Industry) లో విషాదం చోటుచేసుకుంది. తన తొలి వెబ్‌సిరీస్ (First Web Series) విడుదలైన తెల్లారే యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (Belraj Kalarickal) హఠాన్మరణం పాలయ్యారు. ఇరవై ఏడేళ్ల బెల్రాజ్ కొచ్చి (Kocchi) లోని ఒక హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. దాంతో కలకలం రేగింది. బెల్రాజ్ గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తున్నది.
Belraj Kalarickal : మలయాళ చిత్ర పరిశ్రమ (Malayala Film Industry) లో విషాదం చోటుచేసుకుంది. తన తొలి వెబ్‌సిరీస్ (First Web Series) విడుదలైన తెల్లారే యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (Belraj Kalarickal) హఠాన్మరణం పాలయ్యారు. ఇరవై ఏడేళ్ల బెల్రాజ్ కొచ్చి (Kocchi) లోని ఒక హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. దాంతో కలకలం రేగింది. బెల్రాజ్ గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తున్నది.
కాగా బెల్రాజ్ దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ ‘కప్పి స్క్వాడ్’ శుక్రవారమే జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆరేళ్లుగా ఓ మహిళను ప్రేమిస్తున్న ఆయన.. గత సెప్టెంబర్‌లోనే వివాహం చేసుకున్నారు. అటు వృత్తిగతంగా ఇటు వ్యక్తిగత జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో బెల్రాజ్ అకాల మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గతంలో ‘నిజల్’, ‘మధురం’, ‘డాకిని’ వంటి చిత్రాలకు బెల్రాజ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో ఆయన పూర్తిస్థాయి దర్శకుడిగా పరిచయమయ్యారు. రినోష్ జార్జ్, అనఘ అజిత్, దియా దీపన్, జోయెల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. నలుగురు యువకుల స్టార్టప్ కలల నేపథ్యంలో సాగుతుంది. శ్రీకాంత్ మోహన్ రూపొందించిన ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాత రాహుల్ రిజి నాయర్ నిర్మించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

