ఘట్కేసర్, మార్చి 7 : మాధవరెడ్డి సేవలు మరువలేనివని యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘట్కేసర్లోని స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. నాయకులు అనంత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొక్క మోహన్‌రెడ్డి, ఎంజాల బాలరాజ్ గౌడ్, బాల్‌రెడ్డి, సంజీవగౌడ్, సురేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవఖాన సమీపంలోని మాధవరెడ్డి విగ్రహానికి, మండలంలోని వడపర్తి సమీపంలోని మాధవరెడ్డి ఘాట్‌వద్ద జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి నివాళులర్పించారు. ఎంపీపీ నరాల నిర్మలా వెంకటస్వామి, వైస్ చైర్మన్ ఏనుగు సంజీవరెడ్డి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీబీనగర్ సింగిల్‌విండో చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు వివేక్‌రెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సింహ, సత్తిరెడ్డి, కిషన్ పాల్గొన్నారు.
చౌటుప్పల్/బీబీనగర్ర(భూదాన్‌పోచంపల్లి) : చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన మాధవరెడ్డి వర్ధంతిలో మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి పాల్గొన్నారు. మాధవరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీ వెంకట్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్, వైస్ చైర్మన్ బాతుల లింగస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, బత్తుల మాధవి, మార్కెట్ డైరెక్టర్ పగిలి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
వలిగొండ/బొమ్మలరామారం/ఆత్మకూర్.ఎం : టీఆర్ఎస్ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో, బొమ్మలరామారంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో, ఆత్మకూర్.ఎంలో మాధవరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు.