పుట్టపాక మహిళకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు

సంస్థాన్ నారాయణపురం: పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తుంది. పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు తోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబి బోన్ దుబ్బటి పలు వస్త్రలను ప్రప్రంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మ శ్రీ అవార్డులతో పాటు పలు జాతీయ అవార్డులు కూడా వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ప్రకృతి సిద్ధమైన రంగులతో తేలియా రుమాలు తయారు చేసిన పుట్టపాక గ్రామానికి చెందిన అయిటిపాముల నీరజను వరించింది. ఈ అవార్డును చేనేత దినోత్సవం సంధర్భంగా ఈనెల 7న హైదరాబాద్‌లో అందించనున్నారు.
పుట్టపాక గ్రామానికి చెందిన అయిటిపాముల శంకర్ నీరజ దంపతులు నిరుపేద చేనేత కార్మికులు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వంద ఎండ్లుగా వీరి కుటుంబ సభ్యులు తేలియా రుమాలును తయరు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త ప్రోత్సాహంతోనే తేలియా రుమాలును తయారు చేశానని లెలుపుతూ అవార్డు రావడంపై నీరజ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆసు యంత్రం అందజేయడంపై నీరజ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

