Barbie Movie | ‘బార్బీ’ సినిమా చూసిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో
Canada PM Justin Trudeau | తాజాగా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘బార్బీ’ (Barbie) సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలోని బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకురాలు గ్రేటా గెర్విగ్ (Great Gerwig). ఇక ఇప్పటికే ఈ మూవీని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తన ఫ్యామిలీతో కలిసి చూడగా.. తాజాగా ఈ లిస్ట్‌లో మరో దేశపు ప్రధానమంత్రి చేరారు.
Canada PM Justin Trudeau | తాజాగా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘బార్బీ’ (Barbie) సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలోని బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకురాలు గ్రేటా గెర్విగ్ (Great Gerwig). జూలై 21 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ మూవీని చూసేందుకు అన్ని వయసుల వారూ థియేటర్లకు ఎగబడుతున్నారు. అయితే ఈ మూవీకి వెళ్లినవారంత పింక్ అవుట్‌ఫిట్‌లో (బార్బీ స్టైల్)లో వెళుతుండగా ఈ ఫ్యాషన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్(UK Prime Minister Rishi Sunak) తన ఫ్యామిలీతో కలిసి చూడగా.. తాజాగా ఈ లిస్ట్‌లో మరో దేశపు ప్రధానమంత్రి చేరారు.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) తన కొడుకు జేవియర్ (Xavier) తో కలిసి బార్బీ మూవీ చూడటానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని ట్రూడో సోషల్ మీడియాలో వెల్లడించాడు. జస్టిన్ ట్రూడో తన భార్య సోఫీ గ్రెగోయిర్ (Sophie Grégoire)తో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏండ్ల వీరి వివాహ జీవితాన్ని తాజాగా రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే విడిపోతున్నట్లు ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత జస్టిన్ ట్రూడో తన కొడుకుతో కలిసి బార్బీ మూవీకి వెళ్లాడు. వీరిద్దరూ సినిమా థియేటర్లో బార్బీ పోస్టర్ ముందు పోజులిచ్చిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఈ మూవీకి వీరిద్దరూ పింక్ కలర్ డ్రెస్‌లో వెళ్ళారు. జస్టిన్ ట్రూడో పింక్ కలర్ నియాన్ హూడీ ధరించగా.. జేవియర్ ఫ్యూషియా టీషర్టు వేసుకోని వచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
We’re team Barbie. pic.twitter.com/bdwhuTUHxM
— Justin Trudeau (@JustinTrudeau) August 6, 2023
ఇదిలా ఉండగా.. ‘బార్బీ’ మూవీ వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ $ వసుళ్లును రాబట్టి చరిత్ర సృష్టించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

