Small Savings Interest | చిన్న మొత్తాలపై వడ్డీరేట్లు యధాతథం.. !
Small Savings Interest | పీపీఎఫ్, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యధాతథమని కేంద్రం తెలిపింది.

Small Savings Interest | చిన్న పొదుపు మొత్తం పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) తదితర పొదుపు పథకాలకు ఇప్పటి వరకు అమలులో ఉన్న వడ్డీరేట్లే కొనసాగుతాయని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఆరో త్రైమాసికం. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను మూడు నెలలకోసారి కేంద్రం సమీక్షించి నోటిఫై చేస్తుంది. ప్రస్తుతం పోస్టల్ సర్వీసులతోపాటు తపాలా శాఖ తొమ్మిది రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను నిర్వహిస్తున్నది.
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర వంటి ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలపై 7.1%, 7.6%, 6.9 శాతం వడ్డీరేట్లు అందిస్తున్నారు. మిగతా చొన్న మొత్తాల పొదుపు పథకాలపై నాలుగు శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఒక ఏడాది నుంచి ఐదేండ్ల గడువు గల డిపాజిట్లపై ప్రస్తుతం 5.5 శాతం వడ్డీరేటు అమలవుతున్నది. ఐదేండ్ల గడువు గల డిపాజిట్‌పై అధికంగా 6.7 శాతం వడ్డీ వస్తుంది.
ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం, ఐదేండ్ల పాటు సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నారు. ఐదేండ్ల నెలవారీ ఆదాయంపై 6.6 శాతం, ఐదేండ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

