Sperm Cells | న్యూఢిల్లీ: వీర్య కణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబసభ్యులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తయ్యే లేదా అసలు ఉత్పత్తి కాని పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు, కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు.
ఇలాంటి వారిలో లింఫ్ క్యాన్సర్ ముప్పు 60% ఎక్కువగా ఉంటుంది. ఇక టిష్యూ కేన్సర్ ముప్పు 56%, థైరాయిడ్ కేన్సర్ రిస్క్ 54% పెరుగుతుంది. వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉన్నదని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.