బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) మరో అద్భుత ప్రదర్శన కనబరిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్‌సీని మట్టికరిపించిన జోష్‌లో గురువారం బరిలోకి దిగిన హెచ్ఎఫ్సీ సమిష్టిగా సత్తాచాటింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన హైదరాబాద్, జంషెడ్పూర్ ఎఫ్‌సీ(జేఎఫ్సీ) మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. లీగ్‌లో ఎలాగైనా టాప్-4లో నిలువాలన్న లక్ష్యాన్ని ఎంచుకున్న హెచ్ఎఫ్సీ అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికను ఎంచుకుంది. ఈ డ్రా ద్వారా హైదరాబాద్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నది. మ్యాచ్ విషయానికొస్తే హెచ్ఎఫ్సీ తరఫున ఓగ్బాచె(56ని) సూపర్ గోల్‌తో ఆకట్టుకున్నాడు. జేఎఫ్సీ జట్టులో గ్రెగ్ స్టివార్ట్(41ని) ఏకైక గోల్ చేశాడు. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 8న బెంగళూరుతో తలపడుతుంది.