న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ కోలుకుంది. తాజా కొవిడ్-19 టెస్టులో తనకు నెగెటివ్ వచ్చినట్లు హిమాదాస్ గురువారం ట్వీట్ చేసింది. పటియాలలోని జాతీయ శిక్షణ శిబిరంలో గత వారం నిర్వహించిన పరీక్షల్లో హిమాదాస్‌కు పాజిటివ్ రాగా.. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఆమె కోలుకుంది. ‘వైరస్‌ను జయించానని చెప్పేందుకు సంతోషిస్తున్నా. తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నా. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’అని హిమాదాస్ ట్వీట్ చేసింది. గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించ లేకపోయిన హిమ.. వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నది.