Minerva Grand | హనుమకొండలో ఘనంగా ‘మినర్వా గ్రాండ్’ హోటల్ ప్రారంభోత్సవం!
Minerva Grand | హనుమకొండ నగర ఆతిథ్య రంగంలో మరో ప్రతిష్ఠాత్మక హోటల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆతిథ్య సంస్థ మినర్వా గ్రూప్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఎంకేఆర్ సిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన 'మినర్వా గ్రాండ్' హోటల్ ప్రీ-లాంచ్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
హనుమకొండ నగర ఆతిథ్య రంగంలో మరో ప్రతిష్ఠాత్మక హోటల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆతిథ్య సంస్థ మినర్వా గ్రూప్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఎంకేఆర్ సిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన ‘మినర్వా గ్రాండ్’ హోటల్ ప్రీ-లాంచ్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మినర్వా గ్రాండ్ యజమానులు మల్లారెడ్డి ఆలుమల్ల, కుందూరు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా విచ్చేసి హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఆతిథ్య సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్‌ను తీర్చిదిద్దామని, అతిథులకు నాణ్యమైన ఆహారం, సౌకర్యవంతమైన వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ హోటల్లో 70కి పైగా విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశామని, విశాలమైన సూట్ రూమ్స్, ఆధునిక సౌకర్యాలు వ్యాపార, వ్యక్తిగత పర్యటనలపై వచ్చేవారికే కాకుండా విదేశాల్లో నివసించే ఎన్ఆర్ఐల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, 1982 నుంచి ఆహార ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ మరియు శాఖాహార వంటకాలకు ప్రసిద్ధి చెందిన మినర్వా కాఫీ షాప్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విభిన్న రుచులను ఆస్వాదించడానికి ఇవి వేదికవుతాయని పేర్కొన్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, పుట్టినరోజు వేడుకలు, కార్పొరేట్ సమావేశాలు మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఆధునిక సదుపాయాలతో కూడిన విశాలమైన వేదికలను ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

