Funtastic | దమ్మున్న ఛానల్‌పై ఫన్టాస్టిక్ పంచ్.. ఎవరిని ఆకాశానికెత్తినా పత్తా లేకుండా పోవాల్సిందే!
Funtastic | ‘చూడోయ్ మనది బిజినెస్. ప్రతి దానిలో లాభం చూసుకోవాలి. అందరితో పార్టీలు పెట్టించాం. దాని వల్ల మన మీడియాకు బోలెడు వార్తలు, వాళ్లిచ్చే ప్రకటనలతో ఆదాయం, అందరూ మన గురించి మాట్లాడుకుంటారు. ‘వావ్ .. నిజంగా మీకు దమ్ముంది సార్. కానీ క్రెడిబులిటీ?’
Funtastic | ఖల్ .. ఖల్ ..
‘దగ్గా సార్ ?’
‘కాదు దమ్ము…’
‘మీకు దమ్ము కూడా ఉందా?’
‘కూడా ఉందా ? ఏమిటీ ? మనకున్నదే అది. సరే టీవీలో వార్తలు చూస్తే నీకేమనిపిస్తుంది? అదే హస్తం వాళ్ళు, కమలం వాళ్ళు టికెట్లు ఇచ్చిన తరువాత కొట్టుకుంటున్నారు. చనిపోతా అని కిరోసిన్ పోసుకున్నారు. వీటిని చూస్తే నీకేమనిపిస్తుంది?’
‘ఒక పద్ధతి పాడు లేని వీళ్ల చేతిలో రాష్ట్రం పెడితే ఇంకేమైనా ఉందా ? కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. టికెట్లే సరిగా ఇవ్వలేని వారు ఎన్నికల్లో ఏం గెలుస్తారు సార్ …’
‘చూడోయ్ సుబ్బారావు దమ్మున్న నా మీడియాలో నీకు జీతం ఇచ్చేది రాష్ట్రం మంచి చెడులు ఆలోచించమని కాదు. ప్రతి న్యూ సెన్స్ నుంచి ప్రయోజనం పొందాలి. ఇలా కొట్టుకుంటున్న వారితో ఓ పార్టీ పెట్టించి వారికి మనం సలహాదారులుగా ఉంటే ఎలా ఉంటుంది?’
‘ఆ…’
‘మౌనంగా ఉంటావేం చెప్పు?’ ‘మీరేం చేసినా బాగానే ఉంటుంది. మీరు జీతమిచ్చే దమ్మున్న బాస్.’
‘అది కాదు .. ఫరవాలేదు. నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు?’
‘సార్… బయట మార్కెట్లో టాక్ చెబుతాను. ఇప్పటికే మీరు అటు హస్తానికీ, ఇటు కమలానికీ ప్రధాన సలహాదారు. ఆ ఇరు పక్షాలు మీతో టచ్‌లో ఉంటాయి. ఏ పార్టీని మీరు ఆశీర్వదించినా ఆ పార్టీ మటాష్ అవుతుందని, మీది భస్మాసుర హస్తం అని టాక్.’
ఈ టాక్ నేనూ విన్నాను. నువ్వేమనుకుంటున్నావు. చెప్పకపోతే ఉద్యోగం ఊడుతుంది. చెప్పు?’
‘మీ ట్రాక్ రికార్డ్ అలానే ఉంది. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతిని ఆకాశానికెత్తారు. ఆమె పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశలు కల్పించారు. కోదండరాం, గద్దర్, ఇంటి పార్టీ వారూ అనే కాదు, లెక్క లేనంత మందిని మీడియాతో అధికారంలోకి వచ్చేసినట్టు చూపించారు. వారంతా అడ్రస్ లేకుండా పోయారు. ఆంధ్రాలో జగన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణలో వారి సోదరిని కాబోయే సీఎం అని ఆకాశానికెత్తారు. మీ న్యూస్‌ను నమ్మి ఆమె కూడా నేనే కాబోయే సీఎంను అని యూట్యూబ్‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది వాటిని కామెడీ పీసులుగా చూపిస్తున్నారు. ఆమె పార్టీకి క్యాండిడేట్లు దొరకడం లేదు.
‘చూడోయ్ మనది బిజినెస్. ప్రతి దానిలో లాభం చూసుకోవాలి. అందరితో పార్టీలు పెట్టించాం. దాని వల్ల మన మీడియాకు బోలెడు వార్తలు, వాళ్లిచ్చే ప్రకటనలతో ఆదాయం, అందరూ మన గురించి మాట్లాడుకుంటారు.
‘వావ్ .. నిజంగా మీకు దమ్ముంది సార్. కానీ క్రెడిబులిటీ?’
‘క్రెడిబులిటీనా వంకాయా? ఇంతకూ కమలం, హస్తం అసంతృప్తి వాదులను చూసి నేను ఎందుకు నవ్వానో తెలుసా? రెండు పార్టీల అసంతృప్తి వాదులను కలిపి మనం హస్త కమలం అని ఓ కొత్త పార్టీ పెట్టిస్తున్నాం. చేతిలో పువ్వు పార్టీ గుర్తు. వాళ్లని రమ్మని పిలువు.’
‘సార్ ఓ చిన్న డౌట్. ఇప్పటి వరకు మీరు ఎన్ని పార్టీలు పెట్టించారు?’
‘ఓ డజను.’ ‘ఆ పార్టీల నుంచి ఒక్కరైనా గెలిచారా?’ ‘ఒక్కరూ గెలవలేదు.’ ‘ఎందుకు?’
‘ప్రజలు తెలివైన వాళ్ళు. ఏం చేయాలో వారికి తెలుసు. మీరంటే నా ఉద్యోగులు కాబట్టి నా మాట వింటారు. ప్రజలెందుకు వింటారు.’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
LTCG Tax | స్టాక్ మార్కెట్ మదుపర్లకు ఊరట.. ఎల్టీసీజీ పన్ను తగ్గింపుపై కేంద్రం కీలక కసరత్తు!
Hyderabad Land Encroachment | కుర్మల్‌గూడలో కబ్జా పర్వం.. రూ.200 కోట్ల భూమి హాంఫట్
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
Platelet Count | పిల్లల్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

