ఫ్రూట్ కేక్

కావలసిన పదార్థాలు
మైదా: రెండు కప్పులు, చక్కెర: ఒకటిన్నర కప్పు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, పచ్చి ఖర్జూర, టూటిఫ్రూటీ, అంజీర్, ఆప్రికాట్, చెర్రీ ముక్కలు: పావు కప్పు చొప్పున, ఆరెంజ్ జ్యూస్: ఒక కప్పు, పాలు: అరకప్పు, నూనె: అరకప్పు, బేకింగ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా: ఒక టీస్పూన్, ఉప్పు: చిటికెడు
తయారీ విధానం
ఒక గిన్నెలో ఆరెంజ్ జ్యూస్ పోసి డ్రైఫ్రూట్స్‌ని గంటపాటు నానపెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు, నూనె, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత డ్రైఫ్రూట్ మిశ్రమం వేసి మరో రెండు నిమిషాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ మౌల్డ్‌లో వేసి పైనుంచి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి. ఓవెన్లో 180 డిగ్రీల వద్ద నలభై నిమిషాలపాటు బేక్ చేసుకుంటే డ్రైఫ్రూట్ కేక్ సిద్ధం. ఓవెన్ లేనివాళ్లు కుక్కర్లో పెట్టి సన్నటి మంటపై 50 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fruit cake
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

