సైమండ్స్ దుర్మరణం
- కారు ప్రమాదంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆసీస్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన సైమండ్స్ శనివారం రాత్రి టౌన్స్విల్లెకు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో కన్నుమూశారు. దేశానికి రెండు (2003, 07) వన్డే ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన సైమండ్స్ మృతితో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సైమండ్స్ మృతిపై క్రీడా దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్.. సోషల్ మీడియా వేదికగా సైమండ్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
విభిన్న వ్యక్తిత్వం..
భిన్న ఆహార్యం.. విభిన్న వ్యక్తిత్వంతో అంతర్జాతీయ క్రికెట్లో అతికొద్ది కాలంలోనే ప్రమాదకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సైమండ్స్.. ఆల్‌రౌండర్‌గా ఆస్ట్రేలియాకు అమూల్యమైన సేవలు అందించాడు. 1998 నుంచి 2012 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సైమండ్స్.. తన కెరీర్లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1998లో వన్డే అరంగేట్రం చేసిన సైమండ్స్ మొత్తం 5,088 పరుగులు చేయగా, పొట్టి ఫార్మాట్లో 337 రన్స్, టెస్టుల్లో 1,462 పరుగులు చేశాడు. టెస్టుల్లో 24, వన్డేల్లో 133, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టి బౌలర్‌గానూ తన విలువ చాటుకున్నాడు.
ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సైమండ్స్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సైమండ్స్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేవాడు. రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతిచెందగా.. ఇప్పుడు తాజాగా సైమండ్స్ ఉదంతంతో క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వార్న్ చనిపోవడానికి ముందు అంతకుముందే కన్నుమూసిన ఆసీస్ క్రికెటర్ రాడ్ మార్ష్‌కు సంతాపం తెలుపుతూ ఆఖరి ట్వీట్ చేయగా.. సైమండ్స్ కూడా వార్న్‌కు సంతాపం తెలిపిన అనంతరం మరో ట్వీట్ చేయకపోవడం గమనార్హం!
రెండు నెలల్లో ముగ్గురు
క్రికెట్ ఆస్ట్రేలియాకు వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మార్చి నెలలో దిగ్గజ క్రికెటర్లు రాడ్ మార్ష్‌తోపాటు షేన్‌వార్న్ కన్నుమూయగా.. తాజాగా సైమండ్స్ మృతితో క్రికెట్ ఆస్ట్రేలియా విషాదంలో మునిగింది.
మరో అత్యుత్తమ ఆటగాడిని కోల్పోయాం. సైమండ్స్ రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్వీన్స్‌ల్యాండ్ తరఫున గొప్ప ఆటగాడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ విషాద సమయంలో సైమండ్స్ కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.
– క్రికెట్ ఆస్ట్రేలియా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

