ఢిల్లీలో తొలి కరోనా దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారిగా కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ సోకిన 33 ఏండ్ల వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని వారం రోజుల క్రితమే దవాఖానకు తీసుకువచ్చారని, ప్రత్యేకంగా ఒక గదిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తున్నది. వారం తర్వాత అతనికి కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. అయితే బాధితుడిలో తొలుత కరోనా లక్షణాలేవీ కనిపించలేదని తెలిసింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలు తెలియాల్సివుంది.
గతంలో కూడా యూకే రకం కరోనా పాజిటివ్ వచ్చినవారిని ఇదే దవాఖానలో చికిత్స అందించారు. దేశంలో దక్షిణాఫ్రికా రకం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా గత నెలలో ప్రకటించింది. నలుగురు వ్యక్తులకు ఈ వేరియంట్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అదేవిధంగా మరో వ్యక్తికి బ్రెజిల్ వేరియంట్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

