‘సైకోగా నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని చాలా భయపడ్డా. సినిమా చూసిన వారందరూ నా నటన బాగుందని ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. మెహర్తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తేజ కాసరపుతో కలిసి నిర్మించారు. ఇటీవల ‘సోని లివ్’ ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సుహాస్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నటుడిగా సరికొత్త అనుభూతిని పంచిన చిత్రమిది. విభిన్నమైన ఎమోషన్స్‌తో కూడిన క్యారెక్టర్ కావడంతో చాలా కష్టపడి చేశా. మా శ్రమకు చక్కటి ఫలితం దక్కుతున్నది. ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకుండా నటుడిగా అన్ని రకాల పాత్రలు చేస్తా’ అన్నారు. డార్క్ కామెడీ జోనర్లో తెలుగులో చాలా తక్కువ సినిమాలొచ్చాయని, ఆ లోటును ఈ సినిమా భర్తీచేసిందని, కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నదని దర్శకనిర్మాత మెహర్తేజ్ అన్నారు.