పొయ్యిల కట్టెలకోసం అడవిలోకి.. మహిళను తొక్కిచంపిన ఏనుగు

ఈరోడ్: తమిళనాడులో పొయ్యిల కట్టెల కోసమని సమీప అడవిలోకి వెళ్లిన మహిళ ఏనుగు బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈరోడ్ జిల్లా కదంబూర్ అటవీ ప్రాంతంలోని నగరత్తినం పట్టణ సమీపంలోగల కుండ్రీ గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కట్టెల కోసమని వెళ్లిన మహిళ సాయంత్రానికి కూడా ఇంటికి చేరుకోకపోవడంతో.. ఆమె భర్త మరికొందరు గ్రామస్తులతో కలిసి అడవిలో వెతికేందుకు వెళ్లారు.
అక్కడ సదరు మహిళ విగతజీవిగా కనిపించింది. ఆమె ఒంటిపై తీవ్రగాయాలు, చుట్టూ ఏనుగు పాదాల గుర్తులు ఉండటంతో ఆమెను ఏనుగు తొక్కి చంపిందని నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

