రేపటి నుంచి ఏడుపాయల దర్శనం
ఏడుపాయల జాతర | మెదక్ జిల్లా పాపన్నపేటలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం రేపటి నుంచి (గురువారం) పునఃప్రారంభం కానుంది.

మెదక్ : మెదక్ జిల్లా పాపన్నపేటలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం రేపటి నుంచి (గురువారం) పునఃప్రారంభం అవుతున్నట్లు ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు.
ఇటీవల జాతర కాగానే ఆలయ ఈవోతో పాటు మరో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా మార్చి 20వ తేదీ నుంచి ఆలయాన్ని మూసివేశారు.
ఆలయ ఈవో , సిబ్బంది బుధవారం ఏడుపాయల ఆలయాన్ని తెరిచి సంబంధిత సిబ్బందితో మొత్తం ఆలయాన్ని, ఆఫీస్ కార్యాలయంతో పాటు ఇతరత్రా కార్యాలయాల శానిటైజేషన్ చేయించారు.
గురువారం ఉదయం వేకువజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి సంప్రోక్షణ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని ఈవో వెల్లడించారు.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పని సరిగా మాస్కు ధరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

