నిండా ముంచుతున్న మచ్చలు!
నాలుగెకరాల్లో దానిమ్మ తోట వేశాను. మొదట్లో దిగుబడి బాగానే వచ్చింది. కానీ, ఇప్పుడు బ్యాక్టీరియా తెగులు వ్యాపించింది. కాయలపై మచ్చలు ఏర్పడి, పూర్తిగా కుళ్లిపోతున్నాయి. దిగుబడి, నాణ్యత బాగా తగ్గిపోయింది. నివారణ మార్గాలు చెప్పండి.
నర్సింహారెడ్డి, నల్గొండ.
దానిమ్మ రైతులకు ‘బ్యాక్టీరియా తెగులు’ పెద్ద సమస్యగా మారింది. ‘గ్జాంతోమోనస్ ఆక్సోనోపోడిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది. దానిమ్మ ఆకులు, కొమ్మలతోపాటు పండ్లను ఆశిస్తుంది. ఆకులపై అక్కడక్కడా చిన్నచిన్న మచ్చలు ఏర్పడి, వాటి చుట్టూ పసుపు రంగులో వలయాలు వస్తాయి. క్రమేపి ఒక దానితో ఒకటి కలిసిపోయి, పెద్దగా మారి ఆకులు రాలిపోతాయి. కొమ్మలు, కాండంపై ఏర్పడ్డ మచ్చల వల్ల అక్కడి కణజాలం కుళ్లిపోతుంది. చివరికి కొమ్మలు, కాండం విరిగిపోతాయి. కాయలపై ఏర్పడ్డ మచ్చల వల్ల కాయపై పెద్ద చీలికలు ఏర్పడి, అవి కుళ్లిపోతాయి.
నివారణ మార్గాలు : దానిమ్మ మొక్కల ఎంపిక సమయంలోనే సరైన జాగ్రత్తలు పాటించాలి. సాగుకోసం రోగరహిత మొక్కలనే నాటాలి. మొక్కల మధ్య కనీస దూరాన్ని పాటించడం వల్ల తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు. కత్తిరింపుల సమయంలో డెటాల్, స్పిరిట్, సోడియం హైపోక్లోరైడ్ 1% ద్రావణంలో ముంచిన కత్తెరలనే ఉపయోగించాలి. తెగులు సోకిన కొమ్మలను రెండు ఇంచుల కింది వరకూ కత్తిరించి, ఆయా భాగాలకు బోర్డో పేస్టు పూయాలి. నేలపై రాలిన ఆకులు, తెగులు సోకిన కొమ్మలు, కాయలను తొలగించి కాల్చి వేయాలి.
- కత్తిరింపులకు ముందే ఆకు రాల్చడానికి లీటర్ నీటిలో 50 గ్రా. 5% యూరియా నీటికి లేదా 2.5మి.లీ. ఇథైల్‌ను కలిపి పిచికారీ చేయాలి.
- ఎకరానికి 10 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను చెట్ల పాదుల్లో చల్లితే రాలిన ఆకుల్లో బ్యాక్టీరియా నశిస్తుంది.
- కత్తిరింపులు పూర్తయిన వెంటనే 1% బోర్డో మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి.
- కత్తిరింపుల తర్వాత వచ్చిన కొత్త చిగుర్ల పైన రోగ లక్షణాలు కనిపిస్తే.. 10 లీటర్ల నీటిలో 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్,
ప్రైప్టో సైక్లిన్, కె.సైక్లిన్, 5 గ్రా. పౌషా మైసిన్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. - పూత సమయంలో లీటర్ నీటికి 1 గ్రా. కార్బెండజిమ్ కలిపి పిచికారీ చేయాలి.
- లీటర్ నీటిలో 2గ్రా. జింక్ సల్ఫేట్, 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 1 గ్రా. బోరిక్ యాసిడ్ కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

