హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న జాతీయ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి డి. గణేశ్ సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన యూత్ 81 కిలోల విభాగంలో గణేశ్ కాంస్య పతకంతో ఆకట్టుకున్నాడు. స్నాచ్‌లో 123 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 153 కిలోలు..ఓవరాల్‌గా 256 కిలోలతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే జూనియర్ విభాగంలో ఐదో స్థానం దక్కించుకున్నాడు.