Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..!
Xi Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూఢిల్లీకి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
Xi Jinping : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూఢిల్లీకి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌తోపాటు చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, పార్టీ కేంద్ర కార్యాలయ డైరెక్టర్ కై కీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌కు వచ్చారు.
ఈ విషయాన్ని చైనాలో భారత రాయబారి షూ ఫెయిహోంగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగడం ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కీలకమని భారత్ పదేపదే స్పష్టంచేస్తోంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ స్వల్పంగా మాట్లాడుకున్నారు.
ఇప్పుడు న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చైనా రాయబారి షూ ఫెయిహోంగ్ తెలిపారు. మోదీ, జిన్‌పింగ్ వరుసగా మూడో ఏడాది సమావేశం కానున్నారని ఆయన చెప్పారు. గతంలో రష్యాలోని కజాన్, చైనాలోని టియాంజిన్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లేందుకు చైనా కృషి చేస్తుందని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

