Johnny Lever | బాలీవుడ్ నుంచి స్టార్‌కిడ్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదని తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ యాక్టర్ల వారసులు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడిదే జాబితాలో మరో సెలబ్రిటీ కూతురు చేరిపోయిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు పాపులర్ బాలీవుడ్ కమెడియన్ జానీలివర్ కూతురు జామీ లివర్ (Jamie Lever) రెడీ అయింది. జామీ లివర్
తాజా సమాచారం తెలుగులో రాజీవ్ చిలుక తెరకెక్కిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది జామీ లివర్. ఛోటా భీమ్ క్రియేటివ్ వర్క్స్ టీం ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. తన మాతృభాష అయిన తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం మరిచిపోలేని మైల్స్టోన్ అని తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన జానీలివర్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ సెలబ్రిటీగా ఓ వెలుగు వెలుగుతున్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. మరి ఆయన నటవారసత్వాన్ని కూతురు జామి కొనసాగిస్తూ.. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మూవీ లవర్స్, అభిమానులు. జామీ లివర్ హౌస్‌ఫుల్ 4 సహా మరో మూడు హిందీ సినిమాల్లో నటించింది. ఓ వెబ్ సిరిస్, మ్యూజిక్ వీడియో కూడా చేసింది.