ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు సోదరుడు హాజరు

పాట్నా: ఒక ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు ఆయన సోదరుడు హాజరయ్యారు. దీంతో విపక్షాలు దీనిపై అసెంబ్లీలో మండిపడ్డాయి. బీహార్ మంత్రి ముఖేష్ సహాని సోదరుడు, సంతోష్ కుమార్ సహాని శుక్రవారం వైశాలి జిల్లాలోని హాజీపూర్‌లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారులకు పథకాలను అందజేశారు. తన సోదరుడు బిజీగా ఉండటంతో ఆయనకు బదులు తాను వచ్చినట్లు మీడియాతో అన్నారు.
మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాలు శుక్రవారం అసెంబ్లీలో మండిపడ్డాయి. మంత్రి ముఖేష్ సహానీ రాజీనామా చేయాలని, ఆయన సోదరుడిని అరెస్టు చేయాలని, ఈ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, దీని గురించి తనకు తెలియదని సీఎం నితీశ్ కుమార్ సభలో తెలిపారు. ఇలాంటివి జరుగకూడదన్న ఆయన ఇది నిజమైతే షాకింగ్ అని చెప్పారు. దీనిని పరిశీలిస్తానని సభకు హమీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

