West Benal By Polls | భవానీపూర్ బీజేపీ అభ్యర్థికి ఈసీ షోకాజ్ నోటీస్
West Benal By Polls | భవానీపూర్ బీజేపీ అభ్యర్థికి ఈసీ షోకాజ్ నోటీస్ | పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ టీఎంసీ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీస్ ఇచ్చింది. టిబ్రేవాల్ నామినేషన్ వేసే సమయంలో పెద్ద ఎత్తున జన సమీకరణ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ టీఎంసీ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీస్ ఇచ్చింది. టిబ్రేవాల్ నామినేషన్ వేసే సమయంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలు ఉల్లంఘించారని టీఎంసీ ఆరోపించింది. ఎలాంటి అనుమతి లేకుండా సుమారు 500 మంది సమీకరించారని, అలాగే నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన మార్గంలో ఆమె ‘ధునుచి నాచ్’ (సాంప్రదాయ బెంగాలీ నృత్యం.. సాదరణంగా దూర్గా పూజ సమయంలో చేస్తుంటారు)ను ప్రదర్శించారని పేర్కొంది.
అలాగే రిటర్నింగ్ అధికారి జారీ చేసిన నోటీస్‌లో భవానీపూర్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి ఆఫీసర్ సమర్పించిన నివేదికను సైతం ప్రస్తావించింది. అయితే, ఈ ఆరోపణలను ప్రియాంక టిబ్రేవాల్ తోసిపుచ్చారు. ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తుండడంతో టీఎంసీ భయపడుతోందని, తనను ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని విమర్శించారు. ఈసీ నోటీసుకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే, నామినేషన్ దాఖలు చేయడానికి తాను వెళ్లిన వాహనంలో సువేందు అధికారి మినహా ఎవరూ లేరన్నారు. బీజేపీ మద్దతుదారులు సొంత వాహనాల్లో వచ్చారని, నేను ఎలాంటి జన సమీకరణ చేపట్టలేదన్నారు. రోడ్లపై వాహనాల్లో ఎవరు ఉన్నారో చూడడం నా పని కాదని.. పోలీసులు, స్థానిక అధికారులదని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

