Barbie Movie Trend | తాజాగా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘బార్బీ’ సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలోని బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకురాలు గ్రేటా గెర్విగ్ (Great Gerwig). జూలై 21 విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే భారత్‌లో 26 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకోంది.
ఇక ఇప్పటికే ఈ మూవీ కోసం యూత్ అంతా ఎగబడుతున్నారు. అయితే ఈ మూవీకి వెళ్లినవారంత పింక్ అవుట్‌ఫిట్‌లో (బార్బీ స్టైల్)లో వెళుతుండగా.. ఆ ప్రభావం ఫ్యాషన్ ప్రపంచం మీదా పడింది. దీంతో పింక్‌కు ఆదరణ పెరిగింది. ఆ రంగు డ్రస్‌లు, బ్యాగులు, పాదరక్షలు, లిప్‌స్టిక్ మొదలైనవి ఎగబడి కొంటున్నారు మహిళా జనం.
తాజాగా ఈ ట్రెండ్‌కు టెక్ ట్రెండ్(AI Image) జోడిస్తూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister), కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ, అమిత్ షా తదితర రాజకీయ ప్రముఖులు ‘బార్బీ’ లుక్‌లో ఎలా ఉంటారో ఏఐ ఆర్టిస్ట్ కళ్లకు కట్టినట్టు చూపించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ‘అద్భుతం..’, ‘నమ్మలేకపోతున్నాం..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ నాయకుల ‘బార్బీ’ ట్రెండ్ లుక్‌పై మీరూ ఓ లుక్కేయండి.