యాదాద్రి భువనగిరి : శ్రీ పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాతగుట్ట నందు నిర్వహించ తలపెట్టిన అధ్యాయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి.
ఈ మేరకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తేదీ 7-2-2022 నుంచి 10 -2-2022 వరకు అధ్యయణోత్సవాలు,11-2-2022 నుంచి 17-2-2022 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారన్నారు.
ఈ ఉత్సవాలలో భాగంగా 13న ఆదివారం శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 14న సోమవారం తిరుకల్యాణోత్సవము, 15న మంగళవారము రథోత్సవం నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి.