మెల్బోర్న్: గత కొన్నాళ్లుగా పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్న బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఐదేండ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ 6-1, 3-6, 6-4, 6-7 (5/7), 6-4తో నికోలజ్పై విజయం సాధించాడు. ఇప్పటి వరకు ఐదుస్లారు ఆస్ట్రేలియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ముర్రే.. ఐదు సెట్ల పాటు పోరాడి ముందంజ వేశాడు. ‘గత మూడు నాలుగేండ్లు కష్టంగా గడిచాయి. తిరిగి ఇక్కడికి చేరేందుకు చాలా శ్రమించాను’ అని మ్యాచ్ అనంతరం ముర్రే పేర్కొన్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ స్టిఫనోస్ సిట్సిపాస్ 6-2, 6-4, 6-3తో యెమెర్పై.. మెద్వెదెవ్ 6-1, 6-4, 7-6 (7/3)తో లాకసొనెన్పై గెలుపొందారు. మహిళల సింగిల్స్‌లో రెడుకాను, సబలెంక, హలెప్, వోండ్రసోవా గెలిచారు.