మోదీకి బిగ్ థాంక్స్ చెప్పిన ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ధన్యవాదాలు తెలిపారు. జమైకాకు భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్లు పంపించినందుకు రస్సెల్ ప్రధానికి థాంక్స్ చెప్పారు. వ్యాక్సిన్ మైత్రిపై రస్సెల్ ప్రశంసలు కురిపించినట్లు ఆదేశంలోని భారత్ హైకమిషన్ పేర్కొంది.
‘ముందుగా ప్రధాని మోదీ, భారత హైకమిషన్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. కరోనా వ్యాక్సిన్లు ఇక్కడికి వచ్చాయి. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచమంతా మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. జమైకా ప్రజలు దీన్ని నిజంగా అభినందిస్తున్నారు. భారత్, జమైకా ఇప్పుడు సోదర దేశాలు. అందరూ శాంతియుతంగా, సురక్షితంగా ఉండండి’ అంటూ రస్సెల్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆ వీడియోను జమైకాలోని భారత హైకమిషన్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ నెల ఆరంభంలో 50వేల కరోనా వ్యాక్సిన్ డోసులను భారత ప్రభుత్వం జమైకాకు పంపించినందుకు ఆదేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narsingi Road | బిగ్ రోడ్.. బిగ్ దందా.. నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు
Mallanna Sagar | మల్లన్నసాగర్ పైనా మేడిగడ్డ కుట్ర.. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జలాశయం చుట్టూ భారీ పేలుళ్లు
Horoscope | 30-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
రియల్ అల్లకల్లోలం
తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

