స్నానం తర్వాత తడి సబ్బు ఆరడానికి చాలా సేపు పడుతుంది. సబ్బుపెట్టె అడుగున చిల్లులున్నా సరే కాస్తోకూస్తో నీరు అడుగున నిలిచిపోతుంది. దీంతో సబ్బు జిగటగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మార్కెట్లోకి వస్తున్నవే ‘లీఫ్ సోప్ డిష్’లు. వీటి మధ్యభాగంలో ఖాళీలతో ఆకులాంటి నిర్మాణం ఉంటుంది. అడుగున అదే ఆకృతిలో మరోపెట్టె ఉంటుంది.
సబ్బును ఈ ఆకు పైభాగంలో ఉంచితే, వాడిన తర్వాత కాస్తోకూస్తో నీళ్లు ఉన్నా.. అవి కింద ఉన్న పెట్టెలోకి వెళ్లిపోతాయి. సబ్బు త్వరగా ఆరిపోయి, పొడిగా అవుతుంది. సబ్బు వృథా కాదు. గులాబి, ఆకుపచ్చ, నీలంలాంటి రంగుల్లో విభిన్న డిజైన్లో వచ్చే ఈ బాక్సులు బాత్రూమ్కు కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. అమెజాన్లాంటి ఆన్లైన్ సైట్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. ఇంకేం, మీ సబ్బునూ అందంగా ఆరబెట్టేయండి!