ధర: రూ.74,000 దొరుకుచోటు: bumpboxx.com
కొందరు రెట్రో లుక్‌ను అమితంగా ఇష్టపడతారు. అదే సమయంలో.. ఆధునిక టెక్నాలజీని కూడా కోరుకుంటారు. అలాంటివారికి Bumpboxx BB-777 మంచి చాయిస్. ఇది 270W భారీ అవుట్‌పుట్ పవర్‌ను అందిస్తుంది. ఇందుకోసం దీనిలో ఆరు డ్రైవర్స్ స్పీకర్ సెటప్.. 6.25 అంగుళాల సూపర్ వూఫర్లు (రెండు), 6.25 అంగుళాల కో యాక్సిల్ స్పీకర్లు (రెండు), హార్న్ ట్వీటర్లు (రెండు) ఏర్పాటు చేశారు. ఇది బ్లూటూత్, టీడబ్ల్యూఎస్, వైర్లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్యాసెట్ డెక్, సీడీ ప్లేయర్, యూఎస్బీ ప్లేయర్, రేడియో ద్వారా కూడా సంగీతాన్ని ఆస్వాదించొచ్చు. రెండు మైక్ పోర్ట్స్తోపాటు 3.5 mm Aux In, హెడ్‌ఫోన్ అవుట్‌పుట్ ఉన్నది. 97.6 Wh రీచార్జబుల్ ఇంటర్ చేంజబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 15 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది.
జుట్టుకు ఆధునిక జట్టు..
ధర: రూ.45,900 దొరుకుచోటు: అమెజాన్
అత్యాధునిక టెక్నాలజీతో తయారైన బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం చూస్తున్నారా? అయితే.. డైసన్ సంస్థ తయారుచేసిన Airwrap i.d. Hair Stylerపై ఓ కన్నేయండి. బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఆటోమేషన్తో ఈ కొత్తతరం స్మార్ట్ హెయిర్ స్టయిలర్ పనిచేస్తుంది. తీవ్రమైన వేడి లేకుండా, గాలి ప్రవాహం ద్వారా జుట్టును డ్రైయింగ్, కర్లింగ్, స్ట్రెయిటెనింగ్, వాల్యూమైజింగ్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ‘మైడైసన్’ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఒక్క బటన్ నొక్కగానే.. మీ జుట్టు రకాన్ని బట్టి ఆటోమేటిక్‌గా కర్లింగ్, హీటింగ్, కోల్డ్ షాట్ సమయాలను మేనేజ్ చేస్తుంది. ఇందులోని ఇంటెలిజెంట్ హీట్ కంట్రోల్.. ఉష్ణోగ్రతను ఎప్పుడూ పర్యవేక్షిస్తుంది. దీంతోపాటు కొనికల్ బారెల్, 40ఎంఎం లాంగ్ బారెల్, సాఫ్ట్ స్మూతింగ్ బ్రష్, లార్జ్ రౌండ్ వాల్యూమైజింగ్ బ్రష్, డ్రైయర్ ఫ్లై అవే స్మూథర్ లాంటి అటాచ్మెంట్స్ కూడా లభిస్తాయి. వీటి సాయంతో జుట్టును నచ్చినట్టుగా మలుచుకోవచ్చు.
భద్రత కట్టుదిట్టం
ధర: రూ.1,24,000
దొరుకుచోటు: lockin.com
భద్రతకు ఆధునిక టెక్నాలజీని జోడిస్తూ.. ప్రముఖ లాక్ ఇన్ సంస్థ V7 MAX SMART LOCK తీసుకొచ్చింది. అత్యాధునిక బయోమెట్రిక్ భద్రత, వీడియో డోర్ బెల్, బ్యాటరీలను మార్చే అవసరం లేని వైర్లెస్ ఆప్టికల్ పవర్ టెక్నాలజీతో.. ఈ అల్ట్రా-ప్రీమియం స్మార్ట్డోర్ లాక్‌ను తయారు చేసింది. ఆప్టికల్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ వల్ల.. బ్యాటరీలు మార్చడం, చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. గదిలోని ప్లగ్‌కు అమర్చిన ప్రత్యేక ట్రాన్స్మిటర్ నుంచి లైట్-బీమ్ ద్వారా ఈ లాక్ నిరంతరం పవర్‌ను తీసుకుంటుంది. ఒకవేళ కరెంట్ పోయినా పనిచేయడానికి ఇందులో ఇంటర్నల్ ఎమర్జెన్సీ బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది. ఇక భద్రత విషయానికి వస్తే.. ట్రిపుల్ బయోమెట్రిక్ అన్లాకింగ్ టెక్నాలజీని వాడారు. 3డీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా.. మీరు డోర్ ముందుకు రాగానే మిమ్మల్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ తెరుస్తుంది. పామ్ వీన్ స్కానింగ్ ద్వారా.. అరచేతి లోపలి రక్తనాళాల ప్యాటర్ను స్కాన్ చేసి.. డోర్‌ను అన్‌లాక్ చేస్తుంది. వేళ్లు తడిగా, మురికిగా ఉన్నా కూడా.. లోపలి నరాల అమరిక ఆధారంగా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఇక పాస్‌కోడ్ మొబైల్ యాప్, ఎన్ఎఫ్సీ, ఎమర్జెన్సీ ఫిజికల్ కీతోనూ డోర్‌ను తెరవచ్చు. ఇందులో వీడియో డోర్‌బెల్-డ్యూయల్ స్క్రీన్లు, రెండు హెచ్డీ కెమెరాలు ఉంటాయి. బయట ఉన్న సందర్శకులను, డోర్ దగ్గర ఉంచే పార్సిళ్లను స్పష్టంగా చూసేందుకు పనోరమిక్ వ్యూను అందిస్తాయి. ఇక రెండు వైపులా ఉండే ఐదు అంగుళాల డిస్ప్లే ద్వారా.. డోర్ తెరవకుండానే బయట ఎవరున్నారో లైవ్‌గా చూడొచ్చు. టూ-వే ఆడియో ద్వారా.. బయటి వ్యక్తులతో నేరుగా మాట్లాడొచ్చు. ఇందులోని స్మార్ట్ ఎకోసిస్టమ్స్.. అన్ని రకాల స్మార్ట్‌హోమ్ పరికరాలను సపోర్ట్ చేస్తుంది.
గృహోపకరణాలపై స్మార్ట్ కన్ను..
ధర: రూ. 730
దొరుకుచోటు: అమెజాన్
ఏసీ, గీజర్, వాషింగ్ మెషిన్లాంటి గృహోపకరణాలు ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటాయి. అందుకే, వాటిపై నిత్యం ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఇందుకోసం AZIOT 16A Smart Plug with Energy అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించడానికి, వాటి విద్యుత్ వినియోగాన్ని ట్రాక్ చేయడానికి రూపొందించిన స్మార్ట్ ప్లగ్ ఇది. దాదాపు 3,600W వరకు గరిష్ఠ లోడ్‌ను సపోర్ట్ చేసే ఈ ప్లగ్.. వైఫై, బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. Smart Life / Tuya, AZIOT యాప్ ద్వారా పనిచేస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్లతో కూడా పనిచేస్తుంది. ఈ ప్లగ్‌కు కనెక్ట్ చేసిన పరికరం ఎంత విద్యుత్ వినియోగిస్తుందో యాప్‌లో లైవ్‌గా చూపిస్తుంది. నెలవారీ విద్యుత్‌ను
ట్రాక్ చేసి, కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికీ సహాయపడుతుంది. ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, సర్జ్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల.. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల గృహోపకరణాలు కాలిపోకుండా కాపాడుతుంది.