ఆధార్ కార్డు వివరాలతో ఆకట్టుకుంటున్న గణేశుడి పందిరి..
జెంషెడ్పూర్: గణేశ్ ఉత్సవాల్లో పందిళ్లు ఓ స్పెషల్ అట్రాక్షన్. వెరైటీ వెరైటీ పందిళ్లతో నిర్వాహకులు ఆకట్టుకుంటారు. ఇక జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఓ పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధార్ కార్డు వివరాలతో కూడిన గణేశ్ పందిరిని వేశారు. ఆధార్ కార్డు థీమ్‌ను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. తెగ అట్రాక్ట్ చేస్తున్న ఆ పండల్ వద్ద జనం భారీ సంఖ్యలో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఇక వినాయకుడి ఆధార్ డిటేల్స్ ఇలా ఉన్నాయి.
భగవాన్ గణేశుడి అడ్రస్‌లో కైలాసం అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ వద్ద ఆరవ శతాబ్ధం అని రాశారు. ఇక ఫోటో వద్ద విఘ్నేశ్వరుడి ఫోటోను పేస్ట్ చేశారు. ఇక ఆ కార్డుపై ఉన్న బార్ కోడ్‌ను స్కాన్ చేస్తే, అది గూగుల్ లింక్‌కు వెళ్తుంది. ఆ లింక్‌లో గణేశుడి ఫోటోలు ఉన్నాయి. ఆ వినూత్న ఆధార్ పందిరిపై పూర్తి అడ్రెస్ ఇలా ఉంది. శ్రీ గణేశ్ S/o మహాదేవ్, కైలాస్ పర్వతం, టాప్ ఫ్లోర్, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్‌కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ 01/01/600CEగా రాశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

