Postal Jobs | భారతీయ పోస్టల్ శాఖ 23,757 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను నింపనున్నారు. వీటి దరఖాస్తుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
రిజర్వేషన్లవారీగా ఖాళీలు
యూఆర్ (UR) 10,640, ఓబీసీ 4433, ఎస్సీ 3082, ఎస్టీ 2773, ఈడబ్ల్యూఎస్ 2160 ఖాళీలు ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 419, ఆంధ్రప్రదేశ్‌లో 917 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు
అభ్యర్థులు పదో తరగతి (Secondary School Examination) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పదో తరగతి దరఖాస్తు చేసుకున్న పోస్టల్ సర్కిల్ లేదా రాష్ట్రానికి చెందిన అధికారిక స్థానిక భాషలో తప్పనిసరిగా చదివి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, పీడబ్ల్యూడీలకు 10-15 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులకు తప్పనిసరిగా కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

Postal Jobs
ఎంపిక
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు. ఎంపికైన వారికి నెలకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ్ డాక్ సేవక్‌లకు రూ. 10,000-24,470, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు12,000-29,380 జీతం ఉంటుంది.
చివరితేదీ
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31 నుంచే ప్రారంభమైంది. సెప్టెంబర్ 2 నుంచి 21లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఎడిట్, కరెక్షన్లకు సెప్టెంబర్ 23 నుంచి 24 వరకు అవకాశం ఇస్తారు. దరఖాస్తులకు వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement చూడండి.
రిజిస్ట్రేషన్ ఇలా
వెబ్సైట్ https://indiapost.gov.in/gdsonlineengagementను ఓపెన్ చేయండి. మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయాలి. జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. వ్యక్తిగత, అర్హత వివరాలను పూర్తి చేయాలి. తరువాత నచ్చిన పోస్టును ఎంచుకోవాలి. పాస్‌ఫొటో (JPG/JPEG, 30–100 KB), సంతకం (JPG/JPEG, 20–100 KB) అప్లోడ్ చేయాలి. ప్రివ్యూ చూసి ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. తరువాత ఫీజు చెల్లించాలి.
సర్టిఫికెట్లు
పదో తరగతి మార్కుల షీట్. గుర్తింపు కార్డు. క్యాస్ట్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌లను నిర్ధారించే పత్రాలు. పుట్టినతేదీ ధ్రువపత్రం. ప్రభుత్వ ఆస్పత్రి ధ్రవీకరించిన మెడికల్ సర్టిఫికెట్. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో సర్టిఫికెట్ తదితర పత్రాలను అప్లోడ్ చేయాలి.

Post