2023 Cricket World Cup | వన్డే ప్రపంచకప్ ఆడబోయే ఆస్ట్రేలియా స్వ్కాడ్ ఇదే.. స్టార్ బ్యాటర్‌కు దక్కని చోటు
2023 Cricket World Cup | భారత్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మాక వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Cricket australia) తన స్వ్కాడ్‌ను (Australia Squad) ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ (pat cummins) నాయకత్వంలో 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టు (ప్రిలిమినరీ స్క్వాడ్)ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు విడుదల చేసింది.
2023 Cricket World Cup | భారత్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మాక వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Cricket australia) తన స్వ్కాడ్‌ను (Australia Squad) ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ (pat cummins) నాయకత్వంలో 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టు (ప్రిలిమినరీ స్క్వాడ్)ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు విడుదల చేసింది. అయితే ఈ జట్టులో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (Marnus labuschagne) ను పక్కన పెట్టగ.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల (లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా, ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ)కు చోటు దక్కడం విశేషం.
భారత్‌లో జరుగనున్న ఈ మెగాటోర్నీకి (ICC Men’s Cricket World Cup 2023) అక్టోబర్ 5న తెరలేవనుండగా.. నవంబర్ 19న జరుగనున్న ఫైనల్‌తో వరల్డ్‌కప్ ముగియనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరుగనున్న తొలి పోరుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న పోరుతో టీమ్ఇండియా ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. నవంబర్ 15న తొలి సెమీఫైనల్‌కు ముంబై, 16న రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా.. ఫైనల్ అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మొత్తం 10 వేదిక (హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతా)ల్లో మెగాటోర్నీ జరుగనుండగా.. తొలిసారి ఈశాన్య రాష్ర్టాల్లోని గువాహటిలో వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Australia’s provisional @cricketworldcup squad is in 📝
More 👉 https://t.co/Z28E9b9qcu#CWC23 pic.twitter.com/UmLdoeL5tP
— ICC (@ICC) August 7, 2023
ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ (WK), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(WK).
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

