hori habba festival : ఇది కర్నాటక జల్లికట్టు
కర్నాటక జల్లికట్టు హొరి హబ్బా ఫెస్టివల్
సంక్రాంతి పండుగ రోజుల్లో తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు ఎంత పాపులరో తెలిసిందే. అయితే, కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలోని రూరల్ ఏరియాల్లో కూడా ఇలాంటి పోటీలే జరగుతాయి. ప్రతి ఏడాది దీపావళి పండుగ తర్వాత చేసుకునే ఈ వేడుకని హొర హబ్బా ఫెస్టివల్ అంటారు. దీన్నే హట్టి హబ్బా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ జల్లికట్టులాంటిదే. జల్లికట్టు పోటీల్లో ఎద్దుల కొమ్ములకు ఎర్ర జెండాలు కడతారు. ఆ ఎద్దుల మూపురాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకుని వాటిని నిలువరించేందుకు, వాటి కొమ్ములకు కట్టిన జెండాలు తీసుకునేందుకు పోటీపడతారు. పోటీ ముగిసే వరకు ఎవరి దగ్గర ఎక్కువ జెండాలు ఉంటాయో వాళ్లు గెలిచినట్టు. హొర హబ్బా ఫెస్టివల్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. కాకపోతే ఎద్దులు, ఆవుల మెడలో కోప్రా అనే పూల దండ కడతారు. పోటీ రోజున శివమొగ్గ చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా తమ ఆవులు, ఎద్దులను చూడముచ్చటగా అలంకరించి పోటీలకు తీసుకొస్తారు. వాటి మెడకి కోప్రా అనే పూల దండ కడతారు. డబ్బులు, గిఫ్ట్ ఐటెమ్స్, రంగు రంగుల బెలూన్స్‌ని కూడా కడతారు కొందరు. మరికొందరు వాటి కొమ్ములకు రంగులు వేసి తీసుకొస్తారు.
కోప్రా దండ ఉంటేనే విజేత
పోటీ మొదలవ్వగానే ఒక్కొక్క ఎద్దు లేదా ఆవులని ట్రాక్ మీదకు వదులుతారు. వాటిని నిలువరించేందుకు, వాటి మెడకు కట్టిన కోప్రా పూల దండ, డబ్బలు, గిఫ్టులను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీపడతారు. ఎవరికీ దొరకకుండా, కోప్రా దండ మెడలో అలానే ఉండగా పందెం ముగింపు గీత దాటిన ఎద్దు లేదా ఆవుని విజేతగా ప్రకటిస్తారు. పోటీల్లో గెలిచిన వాటికి 40 గ్రాములు లేదా 50 గ్రాముల చొప్పున బంగారం బహుమతిగా ఇస్తారు. వాటి యజమానులకు రాగి నీళ్ల బాటిళ్లు, బైక్‌లను కానుకగా లభిస్తాయి. అంతేకాదు ఈ పోటీల్లో ఎవరైతే ఎక్కువ కోప్రా దండలు సంపాదిస్తారో వాళ్లకు కూడా బహుమతి ఉంటుంది. ఎద్దులను నిలువరించిన వాళ్లకు వెండి కత్తిని బహూకరిస్తారు. పోటీలు శివమొగ్గతో పాటు హవేరీ, బ్యడగి, మల్లూరు, హంగల్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఈ వేడుకని చూసేందుకు జనం భారీగా తరలివస్తారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

