రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్ దొరుకును.. వాలెంటైన్స్ డే రోజు యువకుడి వినూత్న నిరసన
అతడిని చూసి అందరూ నవ్వుకున్నారు కానీ.. అతడు అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఈ విచిత్ర ఘటన.. బాయ్‌ఫ్రెండ్ ఆన్ రెంట్
సాధారణంగా రెంట్‌కు ఏం దొరుకుతాయి. ఇళ్లను రెంట్‌కు ఇస్తారు. బైక్స్, కార్లు.. ఇంకా ఏవైనా వస్తువులను కూడా రెంట్‌కు ఇస్తుంటారు కానీ.. ఎక్కడైనా బాయ్‌ఫ్రెండ్ రెంట్‌కు దొరుకుతాడా? అయినా అమ్మాయిలు అలా రెంట్‌కు దొరికే బాయ్‌ఫ్రెండ్‌ను రెంట్‌కు తీసుకుంటారా? అసలు ఇది జరిగే పనేనా.. జరగదు కదా. కానీ.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్ దొరుకును అంటూ ప్లకార్డ్ పట్టుకొని ఊరంతా తిరిగాడు.
అతడిని చూసి అందరూ నవ్వుకున్నారు కానీ.. అతడు అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని దర్భంగాలో చోటు చేసుకుంది. దర్భంగా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ప్రియాన్షు అనే విద్యార్థికి వచ్చిన ఆలోచనే ఇది.
మెడలో బాయ్‌ఫ్రెండ్ ఆన్ రెంట్ అంటూ బోర్డ్ పెట్టుకొని ప్రియాన్షు దర్భంగా మొత్తం తిరిగాడు. అక్కడ ఫోటోలకు పోజులిచ్చాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు ఇలా వినూత్నంగా ఎందుకు క్యాంపెయిన్ చేస్తున్నావని ప్రియాన్షును అడిగితే ఏం చెప్పాడో తెలుసా? మనం ప్రేమను ప్రజలకు పంచాలి. నేటి యూత్ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్తున్నారదు. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించాలంటే అది కేవలం ప్రేమకే సాధ్యం. సింగిల్‌గా ఉండే యూత్‌కు ప్రేమ పంచడమే నా లక్ష్యం. అంతే కాదు.. చాలామంది యువతీయువకులు.. తమ యవ్వనాన్ని బాయ్‌ఫ్రెండ్స్ కోసమో.. లేక గర్ల్‌ఫ్రెండ్స్ కోసమో వృథా చేస్తుంటారు. యూత్ ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కానీ.. ఇలా బాయ్‌ఫ్రెండ్.. గర్ల్‌ఫ్రెండ్ అంటూ తిరగొద్దు అని చెప్పడం కోసమే ఈ క్యాంపెయిన్‌ను నిర్వహించాను అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు ప్రియాన్షు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

