Uttar Pradesh | ఉద్యోగం కోసం యుద్ధాన్ని లెక్కచేయక.. యూపీ యువత ఇజ్రాయెల్ బాట!
ఏడాదికాలంగా యుద్ధంలో కూరుకుపోయిన ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ధైర్యం చేయడం లేదు. అయితే, మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు మాత్రం సంక్షోభంలో ఉన్న దేశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు.
- జాబ్ కోసం సంక్షోభ పరిస్థితుల్లోకి..
- ఇక్కడ నిరుద్యోగం, చాలీచాలని జీతం
Uttar Pradesh | లక్నో, డిసెంబర్ 4: ఏడాదికాలంగా యుద్ధంలో కూరుకుపోయిన ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ధైర్యం చేయడం లేదు. అయితే, మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు మాత్రం సంక్షోభంలో ఉన్న దేశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇజ్రాయెల్‌లో వివిధ రంగాల కార్మికులకు తీవ్ర కొరత ఉంది. పాలస్తీనా నుంచి వచ్చే కార్మికులపై ఆంక్షలతో కొరత మరింత పెరిగింది. దీంతో ఆ దేశ పాపులేషన్, ఇమిగ్రేషన్ అండ్ బార్డర్ అథారిటీ(పీఐబీఏ), భారత నేషనల్ స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ) కలిసి యూపీలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించాయి.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగిన నియామక కార్యక్రమానికి వందలాదిగా యువకులు హాజరయ్యారు. వీరంతా ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదివిన వారే. యూపీలో నిరుద్యోగం తీవ్రంగా ఉండటం, ఏదైనా పని దొరికినా చాలీచాలని వేతనం కారణంగానే ఇజ్రాయెల్ వెళ్లాలని అనుకుంటున్నట్టు యువకులు చెప్తున్నారు. ఇక్కడ రోజుకు రూ.500 దొరకడం కూడా కష్టమేనని, ఇజ్రాయెల్‌లో నెలకు రూ.1.37 లక్షల నుంచి రూ.1.92 లక్షల వరకు వేతనం వస్తున్నదని, అందుకే యుద్ధం జరుగుతుందని తెలిసినా వెళ్తున్నామని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

