Karnataka woman stripped, thrashed | యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లి బట్టలు విప్పించి, కట్టేసి కొట్టిన యువతి కుటుంబం
Karnataka woman stripped, thrashed | ఒక యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆగ్రహించిన యువతి కుటుంబం యువకుడి ఇంటికి వెళ్లారు. అతడి తల్లిని బయటకు ఈడ్చుకొచ్చారు. బట్టలు విప్పించి, స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. (Karnataka woman stripped, thrashed) కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది.
బెంగళూరు: ఒక యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆగ్రహించిన యువతి కుటుంబం యువకుడి ఇంటికి వెళ్లారు. అతడి తల్లిని బయటకు ఈడ్చుకొచ్చారు. బట్టలు విప్పించి, స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. (Karnataka woman stripped, thrashed) కర్ణాటకలోని బెళగావిలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ కుమారుడితో ఒక అమ్మాయి పారిపోవడంపై ఆమె కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి వేళ ఆ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమెను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. దుస్తులు విప్పించి నగ్నంగా మార్చారు. ఒక పోల్‌కు కట్టేసి దారుణంగా కొట్టారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి తల్లిని కాపాడారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన యువతి కుటుంబానికి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరాయమ్య ఈ సంఘటనపై స్పందించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సహించబోమని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఇప్పటికే ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. బాధిత మహిళకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

