Inappropriate Behaviour | విమానంలో ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తన.. మహిళ ఆరోపణ
Inappropriate Behaviour | ఒక వ్యక్తి విమానంలో తన పట్ల అనుచితంగా ప్రవర్శించినట్లు (Inappropriate Behaviour) మహిళా ప్రయాణికురాలు ఆరోపించింది. దీంతో విమాన సిబ్బంది స్పందించారు. ఆ వ్యక్తి సీటును మార్పు చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి విమానంలో తన పట్ల అనుచితంగా ప్రవర్శించినట్లు (Inappropriate Behaviour) మహిళా ప్రయాణికురాలు ఆరోపించింది. దీంతో విమాన సిబ్బంది స్పందించారు. ఆ వ్యక్తి సీటును మార్పు చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఈ సంఘటన జరిగింది. జనవరి 31న స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్జీ 592 విమానం కోల్‌కతా నుంచి బాగ్డోగ్రాకు ప్రయాణించింది. అయితే పక్కన కూర్చొన్న సహ ప్రయాణికుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు మహిళా ప్రయాణికురాలు ఆరోపించింది. ఆ విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ వ్యక్తి సీటు మార్పు చేసి సమస్యను పరిష్కరించారు.
కాగా, ఆ విమానం బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్‌కు చేరగా ఆ మహిళ, ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. దీంతో తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని ఆ ప్రయాణికుడు చెప్పాడు. తన వల్ల ఆమెకు అసౌకర్యం కలిగి ఉంటే క్షమించాలని కోరాడు. దీంతో ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఆ మహిళా వెళ్లిపోయింది. స్పైస్‌జెట్ ప్రతినిధి ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

