మౌత్ వాష్‌కు ఆర్డర్ చేస్తే.. రెడ్మీ నోట్ 10 ఫోన్ వచ్చింది

ముంబై: మౌత్ వాష్ కోసం అమెజాన్‌లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఆశ్చర్యపోయిన ఆయన జరిగిన పొరపాటును అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైకి చెందిన లోకేశ్ అనే వ్యక్తి రూ.459 విలువైన నాలుగు కోల్గెట్ మౌత్ వాష్‌ల కోసం ఇటీవల అమెజాన్‌లో ఆర్డర్ చేశారు. అయితే ఆయనకు వాటి బదులు రూ.13,000 విలువైన రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయ్యింది. ప్యాకెట్ తెరిచి చూసిన ఆయన లోపల మొబైల్ ఫోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ప్యాకెట్‌పై తన అడ్రస్ ఉండగా లోపల బిల్లు మాత్రం తెలంగాణకు చెందిన మరో వ్యక్తి పేరుతో ఉన్నది.
దీంతో లోకేశ్ దానిని తిరిగి ఇచ్చేందుకు అమెజాన్ యాప్‌లో ప్రయత్నించారు. అయితే మౌత్ వాష్ వినియోగించే వస్తువు కావడంలో సాధ్యపడలేదు. ఈనేపథ్యంలో లోకేశ్ జరిగిన పొరపాటును మెయిల్ ద్వారా అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు లోకేష్ నిజాయితీని మెచ్చుకున్నారు. ఆ మొబైల్ ఫోన్‌ను అమెజాన్ ఆయనకు బహుమతిగా ఇవ్వాలంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.
However on opening the package I can see that the packaging label was mine but the invoice was of somebody else's. I have emailed you as well to get the product delivered to the right person. pic.twitter.com/Ohabdk4BWp
— Lokesh Daga (@lokeshdaga) May 13, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

