videographer elopes with groom’s sister | పెళ్లి వీడియో తీశాడు.. వరుడి సోదరితో పారిపోయాడు
videographer elopes with groom's sister | ఒక వీడియోగ్రాఫర్ పెళ్లిలో వీడియోలు తీశాడు. ఆ తర్వాత వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఆమె తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశాడు. వీడియోగ్రాఫర్, అతడితో వెళ్లిన మహిళ కోసం వెతుకుతున్నారు.
పాట్నా: ఒక వీడియోగ్రాఫర్ పెళ్లిలో వీడియోలు తీశాడు. ఆ తర్వాత వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఆమె తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశాడు. వీడియోగ్రాఫర్, అతడితో వెళ్లిన మహిళ కోసం వెతుకుతున్నారు. (videographer elopes with groom’s sister) బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చందవారా ఘాట్ దామోదర్‌పూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి పెళ్లి జరిగింది. వీడియోగ్రాఫర్ గోలు కుమార్ ఆ వివాహం వీడియో తీశాడు. ఈ క్రమంలో వరుడి సోదరితో చనువు పెంచుకున్నాడు. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు.
కాగా, ఆ మహిళ తండ్రి లక్ష్మణ్ రాయ్‌కు ఆమె భర్త ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో మహిళ తండ్రి వీడియోగ్రాఫర్ గోలు కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశాడు. తనకు ఏమీ తెలియదని వీడియోగ్రాఫర్ తండ్రి చెప్పాడు. అయితే గోలు కుమార్ ఒక మహిళను గ్రామానికి తీసుకువచ్చాడని, ఆ తర్వాత వారిద్దరూ కలిసి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.
మరోవైపు మహిళ తండ్రి లక్ష్మణ్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 4న మార్కెట్‌కు వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందని తెలిపాడు. వీడియోగ్రాఫర్ గోలు కుమార్ ఆమెను కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియోగ్రాఫర్, అతడితో వెళ్లిన మహిళ కోసం వెతుకుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | అనిరుధ్‌రెడ్డి ఒక్కరికే కాదు.. చాలామందికి బిల్లులు ఇవ్వట్లే.. మహేశ్‌కుమార్ గౌడ్
Anantha Nageswaran | 1991లాగే 2026 ఉండబోతున్నదా? కేంద్ర ఆర్థిక సలహాదారు ఏమన్నారంటే?
Elon Musk | భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా.. ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

