Viral video : ఓ మహిళ కదులుతున్న రైలు (Moving train) నుంచి దిగే ప్రయత్నంలో పట్టుతప్పి ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. మహిళ పడుతుండగా గమనించిన రైల్వే కానిస్టేబుల్ (Railway Constable) పరుగున వెళ్లి ఆమెను పక్కకు లాగేశాడు. దాంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ముంబై (Mumbai) లోని బోరివాలి (Boriwali) స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Railway ministry) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రైల్వే పోలీసు చేసిన సాయాన్ని ‘మిషన్ జీవన్ రక్ష’గా రైల్వే శాఖ అభివర్ణించింది. ‘మహారాష్ట్రలోని బోరివాలి స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగుతున్నప్పుడు ఒక మహిళ పట్టు కోల్పోయి రైలుకు-ప్లాట్‌ఫామ్‌కు మధ్యలోకి జారిపోయింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వేగంగా స్పందించి ఆమెను పైకి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆయన చర్య అభినందనీయం. ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు’ అని రైల్వేశాఖ పేర్కొన్నది.
కాగా, గత నెలలో ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అప్పుడు 40 ఏళ్ల వ్యక్తి రెండు బ్యాగులు మోసుకుంటూ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ పట్టుదొరకపోవడంతో కిందపడ్డాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడిని రక్షించారు. కాగా, బొరివాలీలో రైలు నుంచి జారిపడ్డ మహిళను రైల్వే పోలీస్ వేగంగా స్పందించి బయటకు లాగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
महाराष्ट्र के बोरीवली रेलवे स्टेशन पर एक महिला चलती ट्रेन से उतरते समय असंतुलित होकर गिर पड़ी। वहां मौजूद रेलवे सुरक्षाकर्मी ने तत्परता दिखाते हुए उसे बचा लिया।
कृपया चलती ट्रेन से चढ़ने या उतरने की कोशिश न करें।#MissionJeevanRaksha pic.twitter.com/6R8FALdD0d
— Ministry of Railways (@RailMinIndia) March 9, 2025