Anubhav Mohanty : ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరాడు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో మొహంతి కాషాయ కండువా కప్పుకున్నారు.
కాగా, అనుభవ్ మొహంతి రెండు రోజుల క్రితమే బీజేడీకి రాజీనామా చేశారు. గడిచిన కొన్ని నెలల వ్యవధిలో తన తండ్రి, పెద తండ్రి మరణించారని, దాంతో తాను మానసిక స్థైర్యాన్ని కోల్పోయానని, కాబట్టి క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగలేనని బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు పంపిన రాజీనామా లేఖలో మొహంతి పేర్కొన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సొంత నియోజవర్గం కేంద్రపారలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి తన సేవలు అందిస్తానని తెలిపారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా బీజేపీలో చేరారు.