శ్రీనగర్: మంచు వర్షం..! ఈ మంచు వర్షం శీతాకాలంలో రాత్రివేళల్లో కురిస్తే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. దాంతో జనం గజగజలాడాల్సి వస్తుంది. హిమాలయాల పరిసరాల్లో వేసవిలో కూడా మంచు కురుస్తుంటుంది. అలాంటి మంచు వర్షం జనానికి ఆహ్లాదాన్ని పంచుతుంది. వేసవి తాపం నుంచి చల్లదనాన్ని ఇస్తుంది. తాజాగా కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పగటివేళ భారీగా తాజా మంచు కురిసింది.
దూది పింజాల్లా తెంపరలుతెంపరలుగా పడుతున్న ఆ మంచును స్థానికులు ఆస్వాదించారు. ఆకాశం నుంచి పూలు కురిసినట్లుగా కురిసిన మంచును జనం ఎంజాయ్ చేశారు. పగటివేళ ఒక్కసారిగా కురిసిన మంచుతో అనంతనాగ్ జిల్లాలోని పలు ప్రాంతాలు దూది వెదజల్లినట్లుగా తెల్లగా మారాయి. ఆ అందమైన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా ఒకసారి వీక్షించండి..
#WATCH | Fresh snowfall in Anantnag district of Jammu and Kashmir. pic.twitter.com/fekB9tPFus
— ANI (@ANI) January 25, 2023