Amritpal Singh | జైలు నుంచి విడుదలైన అమృత్‌పాల్ సింగ్.. నేడు ఎంపీగా ప్రమాణం
Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) జైలు నుంచి విడుదలయ్యారు.
Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవలే జరిగిన లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమృత్‌పాల్‌కు న్యాయస్థానం పెరోల్ ఇచ్చింది. శుక్రవారం (ఈరోజే) ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు (Dibrugarh jail) నుంచి బయటకు వచ్చారు.
వారిస్ పంజాబ్ దే అధిపతి అయిన అమృత్‌పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ధిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. అయితే, ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమృత్‌పాల్‌కు అమృత్సర్ జిల్లా మెజిస్ట్రేట్ పెరోల్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు షరతులతో కూడిన పెరోల్ ఇచ్చింది. కారాగారం నుంచి ఢిల్లీకి వెళ్లి, తిరిగి కారాగారానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఢిల్లీని వదిలి మాత్రం ఎక్కడికీ వెళ్లకూడదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నప్పుడు అమృత్‌పాల్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ మీడియా ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది.
#WATCH | Assam: Waris Punjab De Chief Amritpal Singh taken out of Dibrugarh jail. He is likely to take oath as Lok Sabha MP in Delhi.
Amritpal Singh won the Khadoor Sahib parliamentary seat in Punjab. pic.twitter.com/EbVbbQ00fI
— ANI (@ANI) July 5, 2024
Also Read..
Hathras Stampede | హత్రాస్‌లో రాహుల్ గాంధీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ
Rishi Sunak | నన్ను క్షమించండి.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
TGPSC | టీజీపీఎస్సీ ముట్టడి.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల అక్రమ అరెస్టులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Land Encroachment | కుర్మల్‌గూడలో కబ్జా పర్వం.. రూ.200 కోట్ల భూమి హాంఫట్
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
Platelet Count | పిల్లల్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

