వ్యభిచార గృహాలు నడపడమే నేరం
న్యూఢిల్లీ, మే 26: స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని, అదొక వృత్తి అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వ్యభిచార గృహాలు నడపటం మాత్రమే చట్ట విరుద్ధం అని గుర్తు చేసింది. సెక్స్ వర్కర్లను వేధించడం, అరెస్టు చేయడం, శిక్షించడం లాంటివి చేయొద్దని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.
అందరిలాగే సెక్స్వర్కర్లకూ గౌరవం ఇవ్వాలని సూచించింది. సెక్స్‌వర్కర్ల ఫొటోలను మీడియా ప్రచురించొద్దని పేర్కొన్నది. తల్లి వ్యభిచార వృత్తిలో ఉందన్న కారణంతో బిడ్డలను వేరు చేయొద్దని సూచించింది. ‘బాలికలు సెక్స్ వర్కర్లుగా ఉంటే వారిని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు’ అని భావించాల్సి ఉం టుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. దీనిపై కేంద్రం అభిప్రాయం తెలపాలని కోరింది. విచారణను జూలై 27కు వాయిదా వేసింది.