Brutal Murder: బీహార్‌లో దారుణం.. వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి హత్య
Bihar: బీహార్‌కు చెందిన వికాశ్‌షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) చీఫ్ ముకేశ్ సహని తండ్రిని దారుణంగా హత్య చేశారు. జితన్ సహని శరీరాన్ని ముక్కలుగా నరికారు. దర్బాంగ జిల్లాలోని ఆయన స్వంత ఇంట్లో హత్యకు గురయ్యారు.
పాట్నా: బీహార్‌కు చెందిన వికాశ్‌షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) చీఫ్ ముకేశ్ సహని తండ్రిని దారుణంగా హత్య(Brutal Murder) చేశారు. జితన్ సహని శరీరాన్ని ముక్కలుగా నరికారు. దర్బాంగ జిల్లాలోని ఆయన స్వంత ఇంట్లో హతమార్చారు. సీనియర్ పోలీసు అధికారి జగన్నాథ్ రెడ్డీ ఈ మర్డర్‌ను ద్రువీకరించారు. జితన్ సహని హత్యతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
బీహార్ సర్కార్‌లో ముకేశ్ సహనీ మాజీ మంత్రిగా చేశారు. ఓబీసీ వర్గ ప్రజల్లో వీఐపీ పార్టీకి మంచి పట్టు ఉన్నది. ఆ పార్టీ తాజా ఎన్నికల్లో ఇండియా కూటమికి సపోర్టు ఇచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో వీఐపీ మద్దతుగా నిలిచింది. కొందరు వ్యక్తులు దొంగతనం కోసం జితన్ సహని ఇంట్లోకి ప్రవేశించారని, కానీ వాళ్లను అతను అడ్డుకోవడంతో హత్య చేసి ఉంటారని పోలీసు అధికారి మనిశ్ చంద్ర చౌదరీ వెల్లడించారు.
మర్డర్‌ను దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను రూపొందించినట్లు సీనియర్ ఆఫీసర్ రెడ్డి తెలిపారు. జితన్ సహని మర్డర్ జరగడాన్ని తప్పుపడుతూ.. నితీశ్ ప్రభుత్వాన్ని ఆర్జేడీ విమర్శించింది. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని షాక్‌లోకి నెట్టివేసిందని ప్రతినిధి శక్తి యాదవ్ తెలిపారు. బీహార్‌లో ఏం జరుగుతోందని, మర్డర్ జరగకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదని, మతిలేని ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, వ్యవస్థ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు.
హత్య ఘటన జరగడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం, బీజేపీ సమ్రాట్ చౌదరీ తెలిపారు. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున ఆయన హామీ ఇచ్చారు. ముకేశ్ సహని ఫ్యామిలీకి అండగా ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆ మర్డర్‌ను ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

