Mayavati: యూపీలో శాంతిభద్రతల్లాగా రోడ్లూ అధ్వాన్నమే..!
Mayavati: ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ( Mayavati ) మరోసారి మండిపడ్డారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ( Mayavati ) మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు. యూపీలో శాంతిభధ్రతలు, ఆరోగ్య వ్యవస్థ మాదిరిగానే రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇది యూపీలో బీజేపీ సర్కారు వైఫల్యం అని మండిపడ్డారు. గతుకుల మయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ట్వీట్ చేశారు.
ఈ మధ్య కాలంలో భారీగా వర్షాలు పడటంతో పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిందని, దాంతో గతుకులమయంగా మారిన రోడ్లపై ఎక్కడ గుంత ఉందో కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతారని మయావతి విమర్శించారు. రోడ్లపై గుంతల కారణంగా ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, పత్రికలు ఎక్కువగా రోడ్డు ప్రమాద వార్తలతో నిండిపోతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై రోడ్లను బాగుచేయించాలని మాయావతి సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

