Shahzadi Khan | షహజాది ఖాన్ జీవించి లేదు.. ఫిబ్రవరి 15నే యూఏఈలో మరణశిక్ష అమలు చేశారు: ఎంఈఎ
Shahzadi Khan | నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహజాది ఖాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణశిక్షను అమలు చేశారు. దీంతో ఆమె జీవించి లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న మరణశిక్ష అమలు చేసినట్లు కోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహజాది ఖాన్ (Shahzadi Khan)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణశిక్షను అమలు చేశారు. దీంతో ఆమె జీవించి లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న మరణశిక్ష అమలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. మార్చి 5న ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాకు చెందిన 33 ఏళ్ల షహజాది ఖాన్ 2021 డిసెంబర్లో అబూ దాబి వెళ్లింది. 2022 ఆగస్ట్‌లో ఒక ఇంట్లో పనికి చేరింది. యజమానురాలు జన్మనిచ్చిన బాబుకు సంరక్షకురాలిగా వ్యవహరించింది.
కాగా, 2022 డిసెంబర్ 7న వ్యాక్సిన్ల కారణంగా నాలుగు నెలల పసి బాబు మరణించాడు. అయితే తమ కుమారుడి మృతికి షహజాది ఖాన్ కారణమని యజమాని కుటుంబం ఆరోపించింది. వారి ఫిర్యాదితో అబూ దాబి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 2023 ఫిబ్రవరిలో షహజాది ఖాన్ నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే హింసించి బలవంతంగా నేరాన్ని ఒప్పించినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది.
మరోవైపు 2023 జూలై 31న షహజాది ఖాన్‌కు అబూ దాబి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న కుమార్తె తనతో చివరిసారి మాట్లాడినట్లు ఆమె తండ్రి తెలిపారు. మరణశిక్ష అమలు కోసం మరో జైలుకు తరలించినట్లు ఆమె చెప్పిందన్నారు. చివరి కోరికగా తనతో మాట్లాడించినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, ఆ తర్వాత తన కుమార్తె బతికి ఉందా లేదా అన్నది తనకు తెలియదని షహజాది ఖాన్ తండ్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టత కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అలాగే తన కుమార్తె సమాచారం కోసం మార్చి 1న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైకోర్టుకు సోమవారం వివరణ ఇచ్చింది. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం న్యాయ సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయినట్లు తెలిపింది. ఫిబ్రవరి 15నే షహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలు చేశారని చెప్పింది. ఫిబ్రవరి 28న తమకు ఈ సమాచారం అందినట్లు వివరించింది. మార్చి 5న షహజాది ఖాన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారని కోర్టుకు వెల్లడించింది. ఆమె కుటుంబానికి ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో చాలా దురదృష్టకరమని న్యాయమూర్తి సచిన్ దత్తా విచారం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

