ఎన్నికల వేళ యూపీలో బీఎస్పీ బ్రాహ్మణ సమ్మేళనం..!
Mayavati: బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) ఈ నెల 23న బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతే స్వయంగా ప్రకటించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ సన్నద్ధతలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి మాయవతి అధ్యక్షురాలిగా ఉన్న బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) ఈ నెల 23న బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతే స్వయంగా ప్రకటించారు.
ఆదివారం లక్నోలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మాయావతి.. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ ఈ నెల 23న అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించనున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులెవరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయరని ఆశిస్తున్నా అన్నారు. అదేవిధంగా బీఎస్పీ పాలనలో మాత్రమే బ్రాహ్మణుల ప్రయోజనాలు కాపాడబడుతాయని బరోసానిచ్చేలా ఈ నెల 23న అయోధ్య నుంచి ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టనున్నట్లు మాయవతి తెలిపింది.
బీఎస్పీ జనరల్ సెక్రెటరీ ఎస్సీ మిశ్రా నాయకత్వంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనున్నది. అదేవిధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై మాయవతి మాట్లాడుతూ.. ఉభయసభల్లో తమ పార్టీ ఎంపీలు ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తుతారని చెప్పారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా ఇందుకు సహకరించాలని ఆమె కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

